Sunday, January 10, 2010

మనిషి -మనుగడ !

ఈ రోజు మా తండ్రి గారి డెబ్బది తొమ్మిదవ జన్మ దినము.
మనిషి ప్రగతి వైపు పయనిస్తున్నాడు. ఆర్ధికం గ ఎంతో ఉన్నతి సాధిస్తున్నాడు. ప్రకృతి వడిలో పుట్టి, ఆ తల్లి నీడ వదలి ఆశల ఎండమావుల వైపు పరుగెడుతున్నాడు. ఆ బాట లో , ఆ పోటీ లో కోల్పోతున్నదేదో సున్నితం గా చెప్పే ఆ చిన్ని ప్రయత్నం మనందరి కోసం. ఈ భావ సమాహారాన్ని ప్రేమతో మా నాన్న గారికి అంకితం ఇస్తున్నాను.
మనిషి- మనుగడ !
మెల మెల్లంగ, ఇల మెచ్చంగ సూరీడు నిదుర లేచెను,
అల్లంత దూరాన, కొండల్ల వెనుకంగ ఎర్రంగ పొద్దు పొడిచెను,
చల చల్లంగ, గిలి గింతంగా పిల్ల తెమ్మెర మేను తాకెను,
తనువంత త్రుల్లంగ, కొలనంత మురువంగా తామర నవ్వేను.
చలి దుప్పటి తీసి ధరణి మేను హొయలు వొలికేను,
లే పచ్చిక పై మంచు బిందువులు ముత్యమల్లె మెరిసేను,
మావి చెట్టుపై రాచిలుక ముద్దు ముద్దుగా పలుకు లొలికేను,
ఎర్ర బారిన నింగిపై తెల్ల మబ్బుల మోము సిగ్గుతో కందేను.
సుప్రభాత పూజకై వడివడిగా పూజారి గుడివంక నడిచేను ,
సేవకై వేగమే కదలి రండు అని గుడిగంట గట్టిగ మ్రోగెను ,
మాలగా మారి స్వామి ఎద చేరగా మందార పూలు నిండుగా పూసెను ,
గుడి నున్న 'మా లక్ష్మి' మోము కుంకుమ కాంతుల ధగ ధగ మెరిసేను.
చలి పులికి జడిసి కంబళి కప్పి బద్దకంగా నేను నిదురించెను,
నింగి -నేల, పచ్చిక- పూలు , చెట్టు -చేమ ,నను చూసి జాలి పడెను,
అందమంత ఇంత విందు చేయ చూడ విది ఏమి ఖర్మమనేను,
మనుజుడై పుట్టి 'మనుగడే 'మరిచావు అని పెరటి తులసమ్మ వగచేను....

Saturday, January 9, 2010

సంక్రాంతి - క్రాంతి

చలి మంచు కెరటాల తడిసి గజ గజ లాడింది లోకం,
మసక వెలుగుతో నిద్రలేచాడు వణుకుతూ దివాకరం,
వడి గ వీది వెంట కదిలాడు హరిదాసు చేస్తూ హరి స్మరణం,
సన్నాయి రాగం తో వయ్యారంగా కదిలింది గొంగిరేద్దుల మేళం.
వీది వీదిన చిరు చీకటి లో రగిలాయి భోగి మంటలు,
ఇంటింట గాదెల్లో నిండాయి సరి కొత్త పంటలు,
ఆనందాలు ఆత్మీయతలు పంచంగ వచ్చారు కొత్త జంటలు,
వంటిల్ల పొంగాయి అరిస బొబట్లు మరెన్నో తీపి వంటలూ,

పిల్ల పాపల తలల నుండి జారు వాలే ఆశీసుల భోగి పళ్ళు,
ఆబాల గోపాలం తోడిగేరు కొత్త దుస్తులు చెదరంగా కళ్ళు,
ఇంటింట త్రుల్లెను అసలా ఆనందాల పరవళ్ళు ,
ఆత్మ రాముని సేవకు వచ్చెను పులిహోర బొబ్బట్లు, గారే ఆవళ్ళు.
ఏటేట వచ్చి మురిపించెను ఈ ఆనందాల సంక్రాంతి ,
ఏనాడు నిమ్పెనో మబ్బు మనస్సులో ప్రేమానురాగాల కాంతి,
రగిలే భోగి మంటల్లో ఏనాడు తొలగేనో స్వార్థ చింతనల బ్రాంతి,
ఆనాడే నిజమైన సంక్రాంతి ..మానవత్వం తెచ్చే శాంతి - క్రాంతి

Sunday, January 3, 2010

the 'Idiotic' fracas

All the papers and the TV channels are only flashing this stuff for the last couple of days. You get bored to see this drama in its ugliest shape the moment you switch on the TV. The mushrooming of news channels brings in its wake this problem of plenty. Unfortunately there is not much real news happening and the poor news guys have to pick up every small daily event that could have otherwise gone unnoticed and blow it into interesting stories. How to sustain audience interest? just keep showing a video footage in endless loops and indulge in day long commentaries. While I can not claim to know the truth behind this event, I only wonder why such things happen despite the boilerplate agreements that are supposed to be drawn by legal luminaries and signed up before even they begin such multi-crore ventures!!! As far as I am concerned I would rather have to stay away from the TV for a couple of days till this dies down.