Sunday, January 14, 2018

సంక్రాంతి లక్ష్మికి కోటి దండాలు!

భోగి మంటల ఎరుపులో సూరీడు పొద్దు పొడిచే;
వెలుగు కిరణాల బాణాలు పొగమంచు తెరలు చీల్చే;
చలిమంచు ముత్తెంపు సరులు గొబ్బెమ్మ సిగపూలు కొలిచే;
హరిదాసు ఆటలు, బసవన్న పాటలు సంక్రాంతి లక్ష్మికి కైవారమిచ్చే!

కొత్త బియ్యంపు బెల్లపు పొంగలి, నేతి అరిసెలు,
బొబ్బట్లు, నువ్వు లడ్డూలతో నోరు మధురమయ్యే !
జంతికలు, సకినాలు, పప్పు చెక్కలు, పులిహోర,
వడలు, ఉల్లి గారెలతో నోరు వర్ర నయ్యే !

వీధి వీధిన పండుగ వేడుకలు; ఇంటింటిన సరదాల పరవళ్ళు;
కొత్త బట్టల్లో మురిసేరు పిల్ల పెద్దలు; నగలతో మెరిసారు ఇల్లాళ్ళు;
అత్తింటి విందులకై అల్లుళ్ళ పరుగులు;
కొత్త కోడలికై అత్తింట మంగళ హారతులు!

రంగవల్లుల పోటీలో బిగిసేను బంధాలు;
గొబ్బెమ్మ పాటలలో కలిసెను కొత్త స్నేహాలు;
బొమ్మల కొలువులో విరిసేను సంస్కృతీ సుమాలు;
వీటన్నిటినీ ఏటేటా మనకిచ్చే సంక్రాంతి లక్ష్మికి కోటి దండాలు!!

Saturday, October 14, 2017

సినిమా వికారం -- మాదీఫల రసాయనం!

సాధారణంగా మధ్యాహ్న సమయం గురకేశ్వరారాధన లో నిమగ్నమై ఉంటాను. కానీ మొన్న ఎందుకో టీవి లో ఏదైనా సినిమా చూద్దామన్న దుర్భుద్ధి పుట్టింది. చానెల్స్ తిరగేస్తుంటే ఒక సినిమా మీద ద్రుష్టి పడింది. ప్రస్తుతం సినీ గగనం లో ప్రకాశిస్తున్న ఒక యువ కిశోరం హీరో గా నటించిన సినిమా అది. పేరు, వూరు , కధా కమామిషు మనకనవసరం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి హీరోస్ నటించిన ఏ సినిమా అయినా పెద్ద తేడా లేకుండా ఒకే మూస పోసినట్లు ఉంటాయి.

నేను చాల తక్కువ సినిమాలు చూస్తాను. వాటిలో థియేటర్ కి వెళ్లి చూసేవి ఏడాదికి ఒకటో లేదా రెండో ఉంటాయి. అన్ని భాషలలోనూ చాల మంచి విమర్శ వచ్చిన సినిమాలు మాత్రమే, అవి కూడా టీవీ లో వచ్చినప్పుడు చూస్తాను. రక్తపుటేరులు ప్రవహించేవి, అర్థం పర్ధం లేని స్కూల్ పిల్లల ప్రేమ కధలు, కన్నీరు మున్నీరు గా కంట తడి పెట్టించేవి, వెకిలి హాస్యపు సినిమాలకు నాకు చుక్కెదురు. ఇవన్నీ వడపోత పోసేక ఇక మిగిలేవి ఎన్ని సినిమాలో మీకే తెలుస్తుంది.

ఇక ప్రస్తుతానికి వస్తే, సినిమా లో మొదటి సీనే సామూహిక ఊచకోత తో మొదలైంది. ఎవరో ఎందుకో, ఎవర్నో కాలక్షేపం కోసం అన్నట్లు చంపుకు పోతున్నారు. బక్క పలుచగా ఉన్న ప్రతినాయకుడు ఎదో మానసిక రుగ్మత వలన కాబోలు, చిన్న చితక ఆర్టిస్టులను, వంకీ కత్తి, పిస్తోలు మొదలైన ఆయుధాలతో, పొడవటం, కాల్చటం వంటి పనులు హడావిడి గా చేసేసి, వాళ్ళందరినీ పెట్రోలు లేదా డీజిల్ పోసి తగలెట్టండి అని పిల్ల గూండాలకు ఆర్డర్స్ జారీ చేసి, ఆ పల్లెటూరి చెరువులో 'యమహా' ఇంజన్ల స్పీడ్ బోటు ఎక్కి వెళ్ళిపోయాడు.

ఈ లోగా పట్టణంలో ఫాన్సీ బైక్స్ మీద, స్పోర్ట్స్ జీప్స్ మీద కాలక్షేపంగా తిరుగుతూ, పేట రౌడీలను అక్కడక్కడ చితకబాదుతూ, వేరే పనిపాట, చదువు చట్టుబండా, ఉద్యగం సద్యోగం  లేకుండా ఉన్న మన వర్ధమాన యువ కిశోరం, సరదాగా తన బడుద్దాయి స్నేహితులతో సిగరెట్స్ కాలుస్తూ, బీరు బాటిల్స్ తో పండగ చేసుకుంటూ ఉంటాడు.

ఇంతలో పంజాబీ పన్నీర్ లాంటి పొడవాటి సొగసుకత్తే , హస్త భూషణం లా ఏవో రెండు పుస్తకాలు పట్టుకుని పాల నురుగులా ఎక్కడనుండో ఎగిరి వస్తుంది. ఆమె పాత్ర ఎంతవరకో తెలియదు కానీ, ఆమెనే  కధానాయిక లేదా హీరోయిన్ అని మనం చచ్చినట్లు అనుకోవాలి. మన హీరో వెంటనే చేతిలో బాటిల్, వెను వెంటనే మనసుకూడా పారేసుకుని, అప్పుడే, అక్కడే, 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' లాగా 'ఐ లవ్ యు' చెప్పేసి, ఆమె ఒప్పుకోవడానికి దయతో ఒకటి రెండు రోజులు టైం కూడా ఇస్తాడు.

మనం గత ఇరవై ఏళ్ళు గా చూసినట్లే మన హీరోయిన్ ఒక గుబురు మీసాల కత్తుల రత్తయ్య లాంటి పెద్ద ఫ్యాక్షనిస్ట్ గారి కుమార్తె. ఆయన ఉండే పెద్ద హవేలీ కూడా లోగడ సినిమాలలో చూపించిన ఇంటికే  కొద్దిగా రంగులు మార్చిన సెట్టింగే. బయట కత్తులు గట్రా నూరుతూ, పురికొసలతో వంకాయ బాంబుల్లాంటివి కడుతూ, ఎఫెక్ట్ కోసం ఎవరో అమాయకుడిని గొడ్డళ్ళతో నరికేస్తూ కనబడే వారంతా కూడా మనం ఇదివరకు సినిమాలలో ఇంచుమించు అదే పనులు చేస్తూ కనబడ్డ వారే.

అదేం ప్రారబ్ధ కర్మో తెలియదు కాని, ఈ అందగత్తెలకి ఎప్పడూ సజ్జనులైన మామూలు కుటుంబీకులు తల్లిదండ్రులు గా ఉండరు. పైగా వీరిని చూస్తే జన్యు శాస్త్రం మీద నమ్మకం  కూడా పోతుంది . మీరే చెప్పండి, లేకపోతే ఏ సినిమా లో చూసినా  తుమ్మ మొద్దుల్లాంటి విలనీయులకి , ఈ పంజాబీ మీగడ తరకలాంటి కూతుళ్ళు ఎలా ఉంటారు? పోనీ వారి భార్యలు కూడా ఉత్తర భారతీయులు కారు. కానీ మనం మారం! దశాబ్దాలుగా అలాగే తీస్తున్నారు, మనం అలాగే చూస్తున్నాం.

ఇక సినిమా గురించి ఆట్టే చెప్పేది ఏమిలేదు. హీరో గారు ఒంటరిగా లంక లో ప్రవేశించిన హనుమంతుడు లా ఈ ఇంట్లో తనదైన రీతిలో ఒక జంపింగ్ బైక్ మీద ఉప్పు అద్దాలు పగలుకోట్టుకుంటూ, చెవులు బద్దలయ్యేలా ఎంట్రీ ఇస్తాడు. విలనీయుని చుట్టూ ఆ మారుమూల పల్లెటూళ్ళో, మండిపోతున్న ఎండలు, చిర్రెక్కించే చెమటల్లో, నల్ల సూట్లు, గాగుల్స్, చెవిలో బ్లూ టూత్ పెట్టుకుని, చేతిలో ఆటోమేటిక్ గన్స్ తో ఒక యాబై మంది ఉంటారు. ఇంత అవసరం అంటారా చెప్పండి? ఆ !! మనకెందుకు లెండీ !  చుట్టుముట్టిన  ఆ బ్లూ టూత్ గాళ్ళను, 'సూపర్ మాన్' కే ఫైట్స్ నేర్పే మన హీరో చావ చితక తంతాడు.

తరువాత కధలో ఏముంది, ఎత్తులు, పై ఎత్తులు, ఏడుపులు, పెడ బొబ్బలు, రంకెలు. ఈ మధ్యలో సమయం, పాడు లేకుండా, ఆ మీగడ తరక ఎక్కడ్నుంచో మెరుపులా దిగి, తన పారితోషికానికి న్యాయం చేకూరుస్తూ, మన కుర్రాడిని పాటలు గట్రా పాడుకోవటానికి  ఇస్తాంబుల్, బార్సిలోనా, బుడాపెస్ట్, పట్టుకుపోతూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పాటలు పాడేసుకుని, మన కుర్రాడు బుద్దిగా మళ్ళీ ఈ పల్లెలోకి దిగిపోతాడు.

చివర్లో సామూహిక మారణ కాండలు, రక్త పాతాలు. దానికి వూళ్ళో జనం అంతా పిల్ల మేకా పిలవని పేరంటం లాగ దిగిపోతారు. ఏమీ తోచని సైడ్ గూండా ఒకడు, ఒక పెద్ద ఇండస్ట్రియల్ రెంచ్ పట్టుకుని గుళ్ళో కొబ్బరికాయలు కొట్టినట్లు జనాల బుర్రకాయలు పగలుకొట్టుకుంటూ తిరుగుతుంటాడు. ఇలోగా మన హీరో, పూర్వం రైల్లో బొగ్గేసే పెద్ద పార లాంటిది పట్టుకుని ఎంతోమందికి దేహశుద్ధి చేస్తుంటాడు. ఇంతలో రెంచ్ గూండా గాడు చేస్తున్న  పాడు పని చూసి, అవటా అని చేతిలో పార పాడేసి, వాడ్ని ఎలాగో వంగో పెట్టి నాలుగు గుద్దులు పీకి, రెంచ్ లాక్కుని పెద్ద విలనీయుడి దగ్గరకు పోతాడు.ఈ లోగా  కొంప మునిగినట్లు పట్నం నుంచి ఓలా కాబ్ వేసుకుని అక్కడకు వచ్చిన హీరో తల్లి దండ్రుల్ని విలనీయుడు తాళ్ళతో కట్టి,  కట్టె పేళ్ళ తో బాదుతూ ఉంటాడు.

చేతిలో రెంచ్ ఊపుకుంటూ అడ్డొచ్చిన చిల్లర గూండాల కాళ్ళు కీళ్ళు విరగ గొట్టుకుంటూ, వాళ్ళ మెడలు, లేత బెండకాయ ముచిక విరగ గొట్టినట్లు అలవోకగా విరిచేస్తూ విలనీయుడి భరతం పట్టటానికి వెళ్తాడు. అక్కడనుండి చాల రీళ్ల వరకు వారిద్దరూ, వాలి సుగ్రీవులలాగా గుద్దుకుంటూ, రక్కుకుంటూ, కుమ్ముకుంటూ, పొడుచుకుంటూ, పిల్లి మొగ్గలేస్తూ, బులెట్ దెబ్బలు తిని మళ్ళీ ఏమి అవ్వనట్లు లేచి తిరిగి కొట్టుకుంటూ కాలం గడుపుతారు. చివర్లో రక్తం ఉమ్ముకుంటూ పంచ్ డైలాగ్స్ కొన్ని విసురుకున్నాకా, ఎందుకో అంత విలనీయుడిలోనూ 'ఛీ ఎందుకీ బతుకు?' అన్న పశ్చాత్తాపం కలిగి కూతురు చేతిని మన హీరో చేతిలో పెట్టి జేబు గుడ్డతో నుదుటి మరియు మూతి మీది రక్తపు మరకలు తృప్తిగా తుడుచుకుంటాడు. ఇక ఈ గ్రూప్ ఫోటోలో పడటానికి క్షతగాత్రులైన, జీబురు తలల వాళ్ళు, మాసి వెలసిన గడ్డాల వాళ్ళు, కండల జబ్బల వాళ్ళు, బండ మొహాల వాళ్ళు, గళ్ళ లుంగీల వాళ్ళు , చంకల బనీన్ల వాళ్ళు మొదలైన చిల్లర గూండాలు కుంటుకుంటూ వస్తారు.

ప్రారబ్ధం కాకపోతే, మీగడ తరక హీరోయిన్ ఎప్పుడూ, అంటే ఇటువంటి అన్ని సినిమాలలోనూ, తన తండ్రి చేత చితక కొట్టించుకుని, తన తండ్రిని చావబాదిన కుర్రాడినే ఆనందంగా పెళ్లి చేసుకుంటుంది. ఎదురుకోళ్ళు తంతు వీళ్ళకి ఇలాగే ఉంటుందేమో.

ఇక పోతే, ఈ మార్క్ సినిమాలలో మనం తెలుసుకునే ముఖ్యమైన జ్ఞాన గుళికలు ఎన్నో వుంటాయి. నా బుర్రకి ఈ కాసినే తోచాయి. 1. ఇందులో ప్రవహించే రక్తం తో ఒక బ్లడ్ బ్యాంకు పెట్టొచ్చు. 2 . ఇందులో వాడే మారణాయుధాలతో సరిహద్దు సైనికులు దేశాన్ని రక్షించుకోవచ్చు. ౩. విలన్ వాడే వాహనాలతో ఒక కాబ్ కంపెనీ పెట్టుకోవచ్చు. 4. హీరోలకు ఏ అర్హత, ఉద్యోగం లాంటివి అవసరం లేదు. వాళ్ళు కాల్చటానికి సిగరెట్లు, తాగడానికి బీరు బాటిల్స్ పుష్కలంగా లభించును. కానీ ఆ కిటుకు మన బోంట్లకు తెలియదు. 5. వారికి పుట్టుకతోనే సకల లలితకళలు, యుద్ధవిద్యలు వచ్చును. 6. వారికోసం మీగడ తరక లాంటి అమ్మాయి ఏ పల్లెలోనైన సరే వేచియుండును. మాట్రిమోనీ.కామ్ సహాయం అవసరం లేదు.7. వారుండేది మన పట్టణం లేక పల్లె లో అయినా, దేశం మాత్రం మనది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారి దేశంలో, పోలీస్, న్యాయ, రాజ్యంగ వ్యవస్థలు ఉండవు. ఎవరికీ వారే వారి పద్దతిలో సెటిల్ చేసుకుంటుంటారు.

మొత్తానికి సినిమా చూసేసరికి ఒక విధమైన మానసిక వికారం, జీవితం మీద విరక్తి , వేదాంత ధోరణి కలిగాయి. వచ్చిన తలనెప్పి, వికారం పోవటానికి, నాకు  ఆ సినిమా హీరోకి ఉన్న పానీయ వసతులు లేకపోవడం వలన, రెండు చెంచాల మాదీఫల రసాయనం పుచ్చుకుని, పూజా మందిరం లోకి వెళ్లి ...

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా,
శ్రవణనయనజం వా మానసం వా‌, అపరాధమ్ క్రియన్తే ....

మయా దోషాన శేషన్వితాన్  హరే 
క్షమస్వత్వం... క్షమస్వత్వం శేష శైల శిఖామణే!

అని గట్టిగా చెంపలు వేసుకున్నాను.

Thursday, October 12, 2017

'ఒక చీర కొనబడింది' ...అనే 'చీరబేరోపదేశం' కధ


మొన్నీ మధ్యన మా శ్రీమతితో కలసి మా ఇలాకా లోనే పెద్దదైన ఒక ప్రసిద్ద చీరల షాప్ కి వెళ్ళాను. అవీ ఇవీ కొన్నతరువాత, ఏవో మాచింగ్ గుడ్డలు కొనుక్కొస్తానని  ఇంకో అంతస్తు కి వెళ్ళింది. ఈ లోగా నన్ను ఒక చీరల కౌంటర్ కి ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చుని వెయిట్ చెయ్యమంది. నాకు తోచక, నా ఫోన్ వాట్స్అప్ సంగతులు చూసి, అన్నీ పనికిమాలిన ఫార్వార్డ్స్ మాత్రేమే ఉండేసరికి చికాకు వేసి ఫోన్ జేబులో పెట్టేసుకున్నాను. ఎదురుగా బీరువాలనిండా రంగురంగుల చీరలు ఉన్నాయి. వాటిని అమ్మే కుర్రవాళ్ళు శాంతంగా గిరాకీ కోసం చూస్తున్నారు.

ఇంతలో ఇద్దరు మధ్యతరగతి గృహిణులు వడివడిగా అడుగులు వేస్తూ ఆటు వచ్చారు. వారిలో ఒక ఆవిడకి సుమారు యాభై ఏళ్ళ వయసు ఉండచ్చు. రెండవ ఆవిడ బహుశా ముప్పైలలో ఉండవచ్చు.

సేల్స్ మెన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. నేను ఉదాశీనంగా చూస్తున్నాను. ఇంతలో వారిలో పెద్దావిడ " మీ దగ్గర గద్వాల్ చీరలు ఉన్నాయా " అని దర్జాగా అడిగింది.
"ఉన్నాయమ్మ కూర్చోండి" అన్నాడు.
తరువాత సంభాషణ ఈ విధంగా సాగింది.

" కొంచెం పెద్ద వయసు వారికి  పనికిచ్చే చీరలు చూపించండి"
" ఏ రేంజ్ లో చూపిన్చ మంటారు?"
" సుమారు రెండు వేలలో చూపించండి"
అతను నాలుగైదు చీరలు తీసాడు. ఇంతలో పెద్దావిడ, " అలా కాదు వెయ్యనుండి, మూడు వేల వరకు చూపించండి"  అంది. అతను చీరల దొంతరలు తీస్తున్నాడు.
ఇంతలో చిన్నావిడ " వదినా మనం రెండు వేలవి చూస్తే చాలు కదా" అని అమాయకంగా అడిగింది.
" నీకు తెలియదు . మనం ధర చెప్పేస్తే నాలుగైదు చీరలే చూపిస్తాడు. ఒక పెద్ద రేంజ్ ఇస్తే చాల చూడచ్చు" అని మెల్లగా చిన్నావిడ చెవిలో జ్ఞాన గుళిక వేసింది. చిన్నావిడ వినయంగా తల ఊపింది.
ఇదేదో మంచి గిట్టుబాటు టైం పాస్ వ్యవహారం లా ఉందే అని సోఫాలో కొంచెం ముందుకు జరిగి చెవులు రిక్కించాను.

చీరలబ్బాయి, ఇంతలో ఒక దొంతర తీసి ఒక చీర మడత తీసి చూపించాడు.
" ఇవి సీకో చీరలు, పెద్దవాళ్ళకి ఎలా పనికొస్తాయి?" అని తల అడ్డంగా ఊపింది. (సీకో కి అర్థం నాకైతే తెలియదు )
"అలాగా, ఐతే ఇవి చూడండి " అన్నాడు
" ఇవి మరీ పలచగా ఉన్నాయి. పెద్దవాళ్ళకి బాగోదు"  అంది.
" ఆవిడ వయసు ఎంత ఉండవచ్చు అమ్మా ?" అడిగాడు.
" సుమారు ఎనభై ఉంటాయి" అంది.
" ఓహో అలాగా , ఇయితే ఇవి చూడండి"  ఇంకో దొంతర ముందుకు తోసాడు.
" అబ్బే ఈ బోర్డర్ మరీ చిన్నది గా ఉంది"
" సరే దీనికి పెద్ద బోర్డర్ ఉంది చూడండి"
" బోర్డర్ సరే కానీ కలర్ మరీ పాతగా ఉంది. మంచి ఇంగ్లిష్ కలర్స్ ఏవైన ఉంటే చూపించండి"

ఇంగ్లిష్ కలర్ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఊపిరి బిగపెట్టి చూస్తున్నా. అతడు బీరువాలోంచి పూతరేకులలాగా మడత పెట్టిన మరో దొంతర తీసాడు. అందులో కొంచెం ముదురు ఆకుపచ్చ రంగు చీర తీసి "చూడండమ్మా మంచి ఇంగ్లిష్ కలర్ " అన్నాడు.

వార్నీ ..ఇంగ్లీష్ కలర్, ఇంగ్లిష్ కలర్ అంటే ఇదా అని నిరుత్సాహ పడ్డాను.

"కలర్ బానే ఉంది కానీ ఎందుకో ఆకర్షణ లేదు. పోనీ వేంకటగిరి చీరలు చూపించండి" అంది.
అతను ఓపిగ్గా ఇంకో బీరువాలోంచి మరో దొంతర తీసాడు. ఒక చీర చూపించి " మంచి బోర్డర్, మంచి రంగు. ఇది మీకు నచ్చుతుంది " అన్నాడు.

ఆవిడ పరకాయించి చూసి, రేట్ లేబెల్ చూసి " ఇది మూడున్నర వేలు ఉందే ఎందుకంత?" అని అడిగింది..
" దీనికి జరీ బుటాలు పెద్దవి ఉన్నాయమ్మ . అందుకే కొంచెం ధర ఎక్కువ " అన్నాడు.
"అంత పెద్ద బుటాలు అక్కర్లేదు, చిన్నవి ఉంటే చూపించండి" అంది
" అయితే ఇది చూడండి , బుటాలు చిన్నవి, ధర కూడా తక్కువే" అన్నాడు.
" దీనికి బ్లౌస్ ఉందా?" 
" లేదమ్మా ! నేత చీరలకి దేనికీ ఉండవు. విడిగా తీసుకోవాలమ్మ " అన్నాడు.
"మళ్ళీ అదొక తల నెప్పి. పోనీ మంగళగిరి, గుంటూరు కాటన్ చూపించండి"

అతను మరొక బీరువా లోంచి ఇంకో దొంతర తీసి మరో చీర చూపించాడు.
 " బోర్డర్ బానే ఉంది, వీటిలో కలర్స్ చూపించండి" అంది.
" అవిగో నమ్మా ! ఈ మూడు రంగులు ఉన్నాయి" అన్నాడు.
" ఎరుపు, పసుపు, నీలం ...అంతేనా ...గంధం రంగు లేదా?"
" లేదమ్మా ! సరే ఈ గుంటూరు జరీ చీరలు చూడండీ. ఇవి తప్పక నచ్చుతాయి"  అని ఇంకో దొంతర తోసాడు.
" అబ్బే ఈ రంగులు అన్నీ ఆల్రెడీ ఉన్నవే. ఇంకా మదుర, కంచి కాటన్ మరి ఏమేమి వున్నాయో అన్నీ  చూపించండి. తొందరగా చూపించండి. మా అయన బయట కారులో కూర్చున్నారు. ఈ పాటికి ధుమ ధుమ లాడుతూ ఉంటారు" అని అసహనం గా అంది.

"ఒక్కొక్కటీ చూపిస్తున్నాను కదమ్మా. ఈ నేత చీరలు మామూలు చీరల్లాగా పోగులు పోయ్యలేము. మడతలు నలిగి పోతాయి. అయినా గుంటూరు, మంగళగిరి నుండి మదుర, కంచి వెళ్ళాలంటే కొంచెం సమయం కావలి కాదమ్మా " అని తన పరిధిలో జోకేడు. దానికి ఏమీ స్పందించక, " ఏమిటో నేను అనుకున్నది దొరకటం లేదు" అని నిరాశగా అంది.

అసలు ఈవిడకి ఏం కావలబ్బా ? నా మైండ్ ఎసరు లాగ మరిగి పోతోంది. నాకు అతను చూపించిన చాల మటుకు చీరలు బావున్నాయి  అనిపించింది. మరి ఆవిడకు ఎందుకు నచ్చటం లేదు? నాకే కనుక కొనే అధికారం ఇచ్చి వుంటే, పది నిముషాలలో రెండు చీరలు కొనేసేవాడిని. బహుశ ఆ అధికారానికి అర్హత కూడా కావాలేమో ! అందుకే మా శ్రీమతి నాకు ఎప్పుడు ఆ అధికారాన్ని ఇవ్వలేదు అనుకుంటా.  ఆవిడకి కావలసినదేమిటి అన్న నా మనసులోని ప్రశ్న అటు ఇటుగా చీరలబ్బాయి అడిగాడు.

"అదుగో ఆ బోర్డర్, ఈ బుటాలు, మరి ఆ ఇంగ్లీష్ కలర్ లో ఉండాలి. ధర కొంచెం అటు ఇటు గా రెండు వేలు ఐనా పరవాలేదు" అంది ట్రేడ్ సీక్రెట్ బయట పెట్టి.

"మంచి కాంబినేషన్ అమ్మా ! కానీ చీరల కంపెనీ వాళ్ళు ఇంకా చేసి ఉండరు. వాళ్ళ మోడల్స్ ఎప్పుడు మీ ఆలోచనల కంటే బాగా వెనకబడి ఉంటాయమ్మా " అని ఒక కాంప్లిమేంట్ విసేరేడు.
ఆ పొగడ్తని ఒడుపు గా పట్టుకుని దర్పంగా చిన్ననవ్వు చిన్నావిడ కేసి విసిరింది. ఆవిడ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని చూసిన పార్ధుని లాగ తల ఆరాధనా భావం తో వంచింది.

ఇంతలో పెద్దావిడ చటుక్కున కుర్చీ లోంచి లేచి ఒక బీరువా  వైపు నడిచి, ఒక దొంతర చూపించి అవి ఏమిటి  అని అడిగింది.
"అవి సీకో చీరలమ్మా . మీరు మొదటే వద్దన్నారు కదా !" అన్నాడు.
పెద్దావిడ ఒక క్షణం అలోచించి "పోనీ మళ్ళీ ఒక సారి చూస్తాను, చూపించండి" అంది.

అతను ఆ దొంతర తీసి ఆమె ముందు పేర్చాడు. ఆవిడా గబ గబా వాటిని  క్రిందా మీద పరకించి చూసింది. హటాత్తుగా "ఇదిగో దీనికోసమే నేను వెతుకుతున్నా" అని ముచ్చట పడిపోతూ ఒక చీర చూపించింది. ఇవి ఎలాగూ ఈవిడికి నచ్చవు అని నిర్లిప్తంగా ఉన్న చీరలబ్బాయి ఉలిక్కిపడి        "బ్రహ్మండమైన సెలక్షన్ అమ్మా మీది " అని పొగడ్తలతో మున్చేసాడు. శత్రువులను చీల్చి చెండాడి విజయాన్ని చేజిక్కించుకున్న కిరీటి లాగ పెద్దావిడ విజయ గర్వంతో చూసింది. చిన్నావిడ గురు భావంతో పెద్దావిడకి కరచాలనం చేసింది.

నాకు ఈ వ్యవహారం ఏమాత్రం కొరుకుడు పడలేదు. ఎదో ఇంకా సస్పెన్స్ ఉంటుందని  చూస్తున్న హిచ్ కాక్ సినిమా లో సడెన్ గా  'ది ఎండ్'  అని పడినట్లు నాకు జరిగిన సంగతి అర్థం చేసుకోవడానికి కొన్ని నిముషాలు పట్టింది. చీరలబ్బాయి బిల్లింగ్ చేయించటానికి వెళ్ళాడు.

పెద్దావిడ " చూడు రమా ! మనం సేల్స్ మాన్ చూపించిన ఏ చీరా  కొనకోడదు. వాడు హడావిడిగా ఎదో చెప్పేసి, ఇది బావుంటుంది అది బావుంటుంది అని మన చేత వాడికి తోచిన చీర కొనిపించడానికి చూస్తాడు. అనుభవం లేని వాళ్ళు ఆ మాయలో పడిపోతారు. మనం సాధ్యమైనన్ని ఎక్కువ చీరలు చూసి, మనకు ఏమి కావాలో వాడికి తెలియనివ్వకుండా, అన్నీ చూసి మనకు బావుందనిపించిన చీరే మనం కొనుక్కోవాలి" అని 'చీరబేరోపదేశం' చేసింది.

నాకు కొంత జ్ఞానోదయం అయిందని చెప్పాలి. ఒక ఎనభై ఏళ్ల సీనియర్ సిటిజెన్ ఎప్పోడో ఒక సారి కట్టుకునే చీర కొనటానికే  ఇంత ప్రజ్ఞ , సమయం కావాల్సివస్తే , ఇక పెళ్లి చీరలు బేరం చేయటానికి ఎంత కావాలో! అందుకే పెళ్ళిళ్ళ టైం లో ఆడవాళ్ళు కంచి, మదుర, బెనారస్ వైపు వలస వెళ్ళిపోయి నెల రోజులకు, వెలిగిపోతున్న కళ్ళతో, చాకలి మూటల లాంటి చీరల దొంతిరితో,  పీక్కుపోయిన మొహాలతో, చిక్కి శల్యమైన మనీ పర్స్ తో తిరిగి వస్తారు. టైం చూసుకున్నాను. ఒక గంట అవుతోంది.. ఇంతకీ మా శ్రీమతి రాలేదే ? బహుశ ఇదే సీన్ ఇంకో అంతస్తులో నడుస్తోందేమో! నా కళ్ళు కొత్త జ్ఞానంతో నిర్లిప్తంగా ఎదురు చూస్తున్నాయి.

( నేను చూసిన, విన్న యదార్ధ సంఘటన, సంభాషణలకు కొంత కాల్పనికత జోడించి వ్రాయటం జరిగింది. ఇది ఎవరు ఎక్కడ చేసేరు అన్న సందిగ్దం లో పడకండి. ప్రతీ చోట, ప్రతీ రోజూ, ప్రతీ చీరల షాప్ లో ఇంచు మించు ఇదే ప్రహసనం బహుశ జరుగుతూనే ఉంటుంది.)





Sunday, August 27, 2017

మధుమేహుడు ...వాట్స్అప్ వేపుడు...

ఈ మధ్య మా దగ్గర బంధువు ఒకరు చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చారు. అయన యాభయ్యవ వసంతంలో అడుగుపెట్టినప్పటికి చూడటానికి, బాగా తంపట వేసిన తాటి తేగ లాగా ధృడంగా ఉంటాడు. ఆరోజు పొద్దుటే నేను దేహంలోని చక్కర నిలువలు ఏపాటి ఉన్నాయో  తెలుసుకోవటానికి గ్లూకో మీటర్ వాడుతున్నాను. పేపర్ లో కొత్త రాజధాని అమరావతి విషయాలు తేగ లాగా నమిలేస్తున్న ఆ పెద్దమనిషి ఒక్క ఉదుటున నా దగ్గరకు వచ్చి, నాకు కూడా చూడవయ్యా కాస్త అని అన్నాడు. పలుకే అంత కరుకు గా ఉండే నీకు షుగర్ ఎందుకు ఉంటుందయ్యా చోద్యం కాపోతేను అని జోకేను. పరవాలేదు చూడు అని ముచ్చట పడ్డాడు. సరేలే అని సూదితో ఒక పోటు పొడిచి మీటర్ లోకి ఎక్కించాను. వెంటనే మీటర్ కుయి ..కుయి మని అలారం మోగింది. ఇద్దరు రీడింగ్ చూసి బిత్తెర పోయాం. శుబ్రం గా మూడు సేంచరీలు కొట్టాడు షేవగ్ లాగ!

ఇదేవిటి చెప్మా చూడబోతే పెద్ద చెక్కర నల్ల వ్యాపారస్తుడు లా ఉన్నడే అని విస్తుపోయా. "ఇదేమిటయ్య ఇదేమన్న తప్పు రీడింగ్ చూపిస్తోందా కొంపదీసి" అని కంగారుగా అడిగాడు. అలాంటి దాఖలా ఎప్పుడూ లేదే అన్నాను నేను. సరే ఎలాగా అల్పాహారం తినాలి కదా, టిఫిన్ తిని రెండు గంటల తరువాత మళ్ళీ చూద్దాం. అపుడు భండారం బయటపడుతుంది అన్నాను. "ఎవరిదీ ? నాదా, దానిదా?" అన్నాడు అనుమానంగా! ఇద్దరిదీను అన్నాను గుంభనగా.

మార్నింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది, నచ్చినవి తిన్నట్టు ఉంటుంది, మీటర్ పని పట్టినట్లు ఉంటుంది కనుక అలా నడచి వెళ్లి, ఉడిపి హోటల్ లో టిఫిన్ తిని వద్దాము అన్నాను. ఉడిపి హోటల్ మాకు షుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడకు వెళ్లి మన మామూలు పద్దతిలో మొహమాటం లేకుండా ప్లేట్ ఇడ్లి, సింగల్ వడ, ప్లేట్ పూరి ఆలుగడ్డల కూరతో సహా తిని, కప్పు ఫిల్టర్ కాఫీ తాగి , క్రేన్ వక్కపొడి వేసుకుని మళ్ళీ నడుచుకుంటూ ఇంటి దారి పట్టేము. దారిలో మధుమేహము దాని పుట్టు పూర్వోత్తరాలు, ఆహారము, వ్యాయామము వాటి పాత్ర మొదలైన విషయాలపై ఘాటైన వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఇంటికి వచ్చాము.

అనుకున్న క్షణం రానే వచ్చింది. మళ్ళీ సూదితో ఒక పోటు పొడిచి మీటర్ లో చూసాము. "ఈసారైనా కరెక్టుగా చూపిస్తోందా?"  అని ఆత్రంగా అడిగాడు. "ఆహా భేషుగ్గా! సత్య హరిచంద్రుడి మునిమనవడు లాగ ....ఇంకే నాలుగు సెంచరీలు చితక బాదేవు"  అన్నాను.  హతవిధీ అని కొంచెము కమిలి పోయిన నీటి తేగ లాగ అయిపోయాడు.

ఇక అప్పటినుండి మేధోమధనం ప్రారంభం. ఆరోజే అతని తిరుగు ప్రయాణం. వెళ్ళిన వెంటనే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరిక్షలు చేయించుకుని మందు మొదలు పెట్టమని సలహా ఇచ్చాము. మామూలప్పుడు ఏమి చెప్పినా పెద్దగా చెవిపెట్టని వాడు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాబోలు సరే నన్నాడు. విషయాలన్నీ మాకు వాట్స్అప్ లో పెట్టమన్నాము. ఎందుకన్నా మంచిదని, ఈ విషయం గురించి వాల్లావిడకి వాట్స్అప్ లో రెండు ముక్కలు తగిలించాము.

తను వెళ్ళిన మర్నాడు నుండి నాకు ఎదో తెలియని అలజడి. ఈ విషయం మన దగ్గర బంధువులకు చెప్పక పోతే ఎలా అన్న ఒక విదమైన ఆండ్రాయిడ్ దురద మొదలుపెట్టి చేతిని నమిలేయసాగింది. ఇక తప్పదనుకుని ఒకరిద్దరు దగ్గర వాళ్ళకు వాట్స్ అప్ లో ఉప్పు అందించా.

ఒక రోజు గడిచేసరికి వేసవిలో శేషాచలం కొండలలో వ్యాపించే దావాగ్ని లాగ ఈ వార్త రంగులద్దుకుని బందువర్గాలలో సుళ్ళు తిరుగుతూ వ్యాపించి చివరాఖరుకు నా వాట్స్అప్ లో సంచలన వార్త గా వచ్చింది. ...ఫలాని మన బంధువు మధుమేహం లో డాక్టరేట్ డిగ్రీ కొట్టేసాడని. బౌలింగ్ ఉన్న లేక పోయిన శతకాల మీద శతకాలు బాదేస్తున్నాడని...హౌరా ! అనుకున్నాను. రెండు రోజులు పోయేటప్పటికి బాగా సామాజిక సృహ కలిగిన బంధువొకరు ఇది ఇలా వదిలేస్తే కుదరదు, మన వంతు సహాయం మనం చెయ్యాలని చెప్పి హుటాహుటిన 'మధుమేహుడు' అన్న వాట్స్ అప్ గ్రూప్ ఒకటి చేసి అందరిని గుంపులో గోవింద చేసాడు. ఇక పరిస్థితులు చేయ దాటిపోయాయి. సలహాల, పరామర్శల పరంపర కోటలు పేటలు దాటిపోయాయి.

" అసలు రెండుపూట్ల అన్నం తినటం వలెనే ఈ ముప్పు "  అన్నారు ఒకరు.
" ఊరగాయ సీసాలు కళ్ళ ముందు వుండటమే నేరం ' అన్నారు ఇంకొకరు.
"రోజూ డబల్ టిఫిన్స్ వద్దురా అంటే విన్నాడు కాదు"
"అలాగా పాపం! పుంజీడు దోశలు, పది పరోటాలు తిని చక్కగా నిభాయిన్చుకునేవాడు"
" అసలు నెయ్యి వాడటమే వీటన్నిటికీ మూలకారణం " అన్నాడొక ఘ్రుత ద్వేషి ( ఆయన నెయ్యి కంచంలో వేసుకోడు, పక్కవాళ్ళు ఎవరైనా వేసుకుంటే, ఎర్రబారిన తన కళ్ళలో  ఆజ్యం చేసుకుంటాడు. అందుకే అయన చూస్తుండగా నెయ్యి వేసుకోవటానికి జంకుతారు)

"అది సర్లేవయ్యా! ఇక జరగవలసింది చూడండి" అన్నాడు పెద్దరికం వొలకబోస్తూ ఒకాయన.
" ఏముంది జొన్న కూడు, రాగి సంకటే దీనికి మందు"
"పొద్దుటే గ్లాసుడు కాకర కాయ రసం పట్టిస్తే యిట్టె గుణం కనిపిస్తుంది"
" ఎవరో పెద్ద మనిషి చెప్పినట్లు పీచు పదార్ధం బాగా తీసుకుంటే జీర్ణ కోశం కుంచె తో కడిగిన ఫ్లాస్క్ లాగా శుభ్రపడుతుందిట"
" వాము, చేదు జీలకర్ర, మెంతులు, నేల గోకుడు తీగ కలిపి నూరి పుచ్చుకోవాలి"
"ఇంకా నయం నూతి గట్టు మీది పాకుడు" అన్నావు కాదు అని చిరాకు పడ్డాడు మధుమేహుడు.

" గంగ వెర్రి కూర, దొంగ గలిజాకు కలిపి పప్పు  చేసుకోవాలి"
" దాంట్లో తిక్కరేణి గింజలు పోపు పెట్టాలా " అని తిక్క గా అడిగాడు మధు మేహుడు

" ఇవేమీ కుదిరెట్లు లేవు కాని చక్కగా వంతెన దాటి మంతెన దగ్గరకు పోవటం మేలు " అన్నాడొక ప్రాస కవి.
" అర్జెంటు గా అమెజాన్ లో రుజుతా దివేకర్ పుస్తకాలు పురమాయించి చదువు" అన్నడొక గ్రంధప్రియుడు.

ఇలా వారం గడిచేసరికి వాట్స్ అప్ సందేశాలు హనుమంతుడి తోకలా, అలనాడు సభ లో ద్రౌపది కట్టిన కృష్ణా బ్రాండ్ సిల్క్ చీరలా, ఇంతింతై , వటుడింతై అన్నట్లు తారా ప్రమాణానికి చేరుకున్నాయి.

నిన్న ఉదయం ఫోన్ అందుకుని చూద్దును కదా, గ్రూప్ నుండి 'మధుమేహుడు లెఫ్ట్' అని కనిపించింది. అవాక్కయ్యాను. ఇదేమిటి తనకోసం ప్రత్యేకం గా కట్టిన దేవాలయంలోంచి దేవత మాయమైనట్లు , తన కోసం పెట్టిన గ్రూప్ లోంచి తానే మాయమయ్యాడు? ఇదేమిటి చోద్యం అని తికమక పడ్డాను. ఇక సలహాలు, చిట్కాలు ఎవరికి చెప్తాం అని సామూహికంగా వాపోయ్యారు గ్రూపీయులు.

ఏమి జరిగిందో తెలుసుకుందామని వాళ్ళ ఆవిడకు వాట్స్అప్ కాల్ చేసాను. ఆమె ఎంతో విషాదంగా " ఏమి చేస్తారు చెప్పండి. అహో రాత్రాలు, పరామర్శలు, సలహాలు, చిట్కాలు. అది తినొద్దు..ఇది తిను, అది తాగొద్దు..ఇది తాగు..ఈ పొడుం తిను ...ఆ రసం తాగు అన్న సలహాల సునామీకి అయన చీకాకు బాగా పెరిగిపోయి వేసుకున్న మందు కూడా వంట బట్టటం లేదు. ఈ సలహాల గుండు సూదులతో బుర్ర, పిన్ కుషన్ లాగ అయిపోయిందని బాధపడుతున్నారు. అందుకునే గ్రూపు నుండి వచ్చేసారు. మీరైనా అర్థం చేసుకుంటే అదే పదివేలు" అని వాపోయింది.

"ఒహో అదా సంగతి. నువ్వేమి బాధ పడకమ్మా! నేను చూసుకుంటానులే. అయిన జనాలకి వేళాపాళ, సమయం సందర్భం, వివేకం విచక్షణ ఉండొద్దూ! " అని సానుభూతి తెలిపా.
" అన్నట్లు విషయం మరిచా; నేరేడు గింజలు, మెంతి గింజలు వేయించి, పొడుం గొట్టి , గోరు వెచ్చని నీటితో... ..కుయి...కుయి...కుయి...ఇదేంటి ఫోన్ కట్ అయిన శబ్దం వస్తోంది. కట్ అయిందా ...లేక చేసిందా ..? అయినా నేనేమీ తప్పు చెప్పలేదే !!"  అని అయోమయం గా బుర్ర గోక్కున్నాను.

*****


Sunday, April 17, 2011

“PAULONOMIA”

On that warm October day, early in the morning, at a time when most of the Mumbaikars start hurrying towards the local stations, as usual, I sauntered towards the front door in half-stupor for picking up the morning news paper. When my lazy eyes scanned for the headlines, something hit me a like a bolt and shook me up into complete wakefulness. ‘Paul the Octopus- Dead !’ was the news that drowned me into a mood of deep melancholy.

Like everybody’s, Paul caught my fancy during the FIFA World Cup. The clinical accuracy with which Paul predicted Germany’s wins initially and later that of Spain’s made this ‘mussel’ eating, tentacled creature into a celebrity. While he lay dead in the ‘Oberhausen’ water tank peacefully, tired of the stupid football predictions, deep pangs of sorrow overwhelmed me. In fact, I nursed a secret desire to have Paul by my side at office, at home and wherever I went. But that was not to be. At office, everybody shared my grief and we all paid our homage marking a couple of minutes of silence while some hardcore fans went to ‘Mahesh Lunch Home’ and ate sea food for lunch in honor of the eight legged wizard.

That night I returned home and the mood was somber. I surfed the news channels giving coverage on ‘Paul –the Oracle’. The visuals of Paul clutching the mussel box with a flag were appearing in an eternal loop with a number of people blabbering their opinions. A swell of moisture in my eyes blurred my vision...

***

A sudden commotion from the kitchen drew my attention. My wife came out rushing and announced “Thank Paul! The maid is coming to work today!” “You mean Paul confirmed it?” I went to the kitchen to cross check and saw Paul Jr, clutching the card ‘Yes’ and swimming around in the small aquarium. I patted the glass fondly and left for getting ready to office.

When I entered the office, I saw all my gang gathered around my table looking very excited. “Hey! What’s going on?” I asked. Sudha turned around and said in a half-shout “Paul has picked up 5 names out of the 11”. “That’s great! So we are on to something this month!” I heaved a sigh of relief. I cleared the gathering and moved closure. ‘Paul’ was evaluating small chits of executive summaries with a few of the tentacles, clutching an occasional chit and tossing a few away. Venu was muttering a couple of Slokas with tearful eyes and I saw Alex making a thankful ‘Cross’. I asked them the reason for such an ecstatic state. “You see boss! Dear Paul has picked up solidly that Infra company deal of mine” said Venu. In the meanwhile Alex collected his composure and said “I am so delighted he picked up my Renewable Energy deal with all his tentacles. I am planning to give him a special treat of ‘handpicked mussels’ tomorrow”. “Congrats buddies!” Just then I saw, Dixit making weird sounds at Paul unmindful of mine or other’s presence. It looked intriguing and I asked the others “wassup?” Rahul came near and said conspiratorially “Since yesterday, he has been trying to coax and cajole Paul into picking up that chit of his. But unfortunately Paul has not been showing any interest. He is getting frustrated but not giving up” I pitied him, pondered over for a while and asked him to get a copy of that chit. Rahul brought the chit and I read the content. I thought for a while, went out, made a call and had a convincing talk with the person at the other end. I came back to the room, scribbled something on the chit and asked Vivek to put it in the Paul’s aquarium. Paul rolled his eyes philosophically, touched the chit tentatively, cocked its head a little, closed its eyes for a second and suddenly swooped down on the chit and hugged it tightly with his all encompassing arms and winked at me appreciatively. A sudden burst of excitement from the onlookers shook the room. Vivek violently moved his body endangering the longevity of the office chair he was sitting on and shouted “it’s done, it’s done!!”

Girish gathered his wits and asked me “Boss what’s the magic you did?” I took him aside and told him “Nothing great and definitely no magic. The chit proposed a receivable finance and cash-flow escrow. But you know it doesn’t work that way. I talked to the promoter, explained the difficulty and convinced him to get us pari-passu charge on assets. I just added it there on the chit and lo! Paul was excited!” I wanted Paul to be left undisturbed for some time and asked the gang to disburse. Paul waved his arms thankfully and started eating a few mussels for the mid-morning snack.

I must say, ever since Paul arrived on to my table aquarium, things have brightened up and life has become much easier. Decision making became a lot simpler and disappointments a lot lesser. As a community we are greatly indebted to Paul and it may not be untruth, if we say, a few of us secretly believe him to be the ‘Ekadasha avatar’ of Lord Vishnu.

Interrupting my thoughts, Praharsh, chan and venu filed into my room. I looked at them quizzingly. “Boss! Have you forgotten? We scheduled a rendezvous with Paul for you know, finalizing that list of ‘troubled stuff’. “Oh! Come in. Let’s start” I said and turned to Paul “Sorry for troubling you again dear! We are anxious to know which of these three chits could be a cause for worry. Pl pick up the tough nut” I appealed to Paul with all due respect and put the chits in the tank. Paul looked at them for a minute, played with them for a while, dropped them and moved aside and started eating another lot of mussels. “Great heavens! All are safe. Thank you very much Paul” we all congratulated one another and called for a hot cup of coffee. I suddenly remembered that Vijay, the analyst, wanted to come to our office in the evening. I told them about this and asked whether they had any idea of why he wanted to visit us. They gave a smile and Venu said “he is getting about a dozen chits and wants to consult Paul as to ascertain which one finds favor internally and which one doesn’t. You know it saves lot of trouble and time. He is also getting a pound of Sea-food as the usual fees and service tax”. So is he also a ‘Paulonomic’? Good. Let the tribe grow!” I felt happy.

The monotonous ring of my cell phone woke me up rather abruptly from my sleep. I found myself perilously perched on the edge of the couch in the drawing room. My wife was going about seriously doing some kitchen work. “What happened to the maid” I asked in a confused tone. “No. she did not come today”. She sounded disillusioned. “But Paul confirmed you said” I asked worriedly. “What Paul? Which Paul? Are you alright? This is what happens when you sleep at odd times” she dismissed the whole issue. So was it all a sweet dream of ‘Paulnomia’? Suddenly the world looked so difficult and hard to deal with. The Paul news was still going on in the TV showing clips of the dear creature moving in the water tank. I felt Paul winking at me wickedly.

***

Wednesday, March 24, 2010

నాడు -నేడు

వీధి కోడి గొంతెత్తి కూసి లేపేను పొద్దు పొడిచేనని నాడు
'శుక్లంబరదరం' అంటూ శ్లోకాన తట్టి లేపేను గడియారము నేడు

గరకు ఎర్ర పోడుముల రుద్ది పళ్ళు తోమేము నాడు
పెక్కు కాసులు పోసి రంగు లేహ్యాలు పూసి కడిగేము నేడు

తరవాణి,చలిది వన్నాల చల్లంగా కడుపు నిమ్పేము నాడు
వెన్న రొట్టెలు, ఇడ్లి ఉప్మాలు విధిగా అల్పాహారం అయ్యెను నేడు

ఆకు చెప్పులు, చిరుగు చొక్కాలు వేసి దుమ్ము దూగర నడిచి చేరేము పాటశాల నాడు
నల్ల బూట్లు తొడిగి,తెల్ల దుస్తులతో బస్సు ఎక్కి వెడలేరు కాన్వెంటుకు నేడు

సైకిలెక్కి మండు ఎండన చెమట చొక్కాల అలసి చేరేము కార్యాలయము నాడు
సూటు బూట్లు వేసి మోటారు నందు చల్లంగా వెడలేము ఆఫీసు కు నేడు

రెండు వారాలలో ఖర్చాయే జీతము అప్పిచ్చు వాడె కరువాయే నదియె చింత నాడు
ధనము లేకున్నా క్రెడిట్ కార్డులు ఉన్నవి చెంత భయమేల యిక నేడు

ఒంటి గది వాటాల యందు కిక్కిరిసి నలుగురైదుగురు కలసి వసించేరు నాడు
ఐదారు గదుల మేడ మిద్దెల యందు ఒంటరిగా గడిపేరు జీవనము నేడు

బడుగు జీతాల , ఇరుకు వాటాల యందు జనియించి వికసించెను ప్రేమ బంధాలు నాడు
పెక్కు సంపదల, మేడ మిద్దెల యందు సమసిపోయెను ఆత్మీయతలు నేడు !!!
(11 -04 -2004 )

Sunday, March 21, 2010

"The Rise and Fall of Idlis"

(15h March, 2010. 839 words)

Some days everything turns out good; and some days everything turns out not so good. But we get to know that only as the day progresses. That particular day, when I got out of my car and was heading for my office on the third floor, I had a strange feeling that things were going to be good. The moment I stepped into the office, I saw Vivek with his usual roly-poly and boisterous presence beaming at me. He came near and announced, “Boss, we have planned something exciting for the lunch!”
“What’s so special today?” I exclaimed.
“Nothing! Just to pep up our spirits for the year-end” said Vivek, with his eyes brimming with enthusiasm.
“Then what’s that exciting stuff you have planned for?” I queried.
“How would you like to have something from the South –say, Idlis…?” he said in a teasing tone.
“Idlis?” I almost shouted.”Did you say what I think I heard you say?” He nodded with his face beaming as he knew his words spelt magic on me.
“You mean... the soft, mellow, buttery, steaming, delightful heavenly things that we so lovingly consume in umpteen numbers every morning in the South?” I asked, still suspecting a cruel joke being played on me. But having known Vivek, I ruled out such a possibility and blurted out “How could I … ever thank you my dear friend?”
“You are welcome Boss! But please be available at lunch time as the stuff arrives from the nearby joint and there are quite a few people who would like to have a go at them”
Now I understood why the strange feeling about things turning good today came about a few minutes ago. I was exhilarated and felt almost as happy as I would be, when one of my truant borrowers called up to say that he was clearing the over-dues.
Idlies have always been my favorite snack since childhood. In the South, as the day dawns, a plateful of steaming Idli appears with its consorts-chutney and sambar and people get on to the daily chores only after attending the ‘Idli Service’. The art of making idlis is transferred to the daughters religiously by their mothers, even when they are quite young. As a child, I heard a couple stories about how some marriage alliances were unceremoniously rejected due to the girl’s ignorance of making Idlis. Unconfirmed rumors during those times talked about ‘Idli harassment’ being the main reason behind ‘dowry harassments’. I also heard about how a belligerent husband was tamed and subjugated to slavery by a wife intelligent enough to make buttery Idlis every morning. More recently when I was in Delhi attending the budget meeting, I involuntarily accepted a few crores hike in revenue budget, when I saw Idlis being arranged for lunch on the side table.
I cannot now clearly recollect how I finished my morning meetings, daily business trackers, credit queries. But I remember that I went through the stuff with an unblemished smile, with my mind probably working out on a decent equation of how many Idlis I would have that afternoon.
The moment arrived and on a signal from Vivek, I hurried towards the pantry room unmindful of the closed glass partition and banged my forehead. Cursing silently, I went into the congested pantry room. The scene was not very encouraging with quite a few people gathering around something that seemed like a big casserole. As I wanted a more peaceful milieu for the rendezvous with my favorite snack, I returned deciding to come back a little later.
I was briefly possessed by idli mindedness. In my imaginary World, the planets looked like giant-sized celestial Idlis. The World appeared to be ‘idli-eaters’ paradise. I felt a strong need for starting societies world-wide for the promotion of ‘idli-consciousness’. “Idli-eaters of the World unite! You have nothing to brave but a few banged foreheads!” I shouted to myself.
A few minutes later I moved into the pantry as if in a trance. The scene cleared quite a bit with hardly a couple of guys hanging about. The casserole looked empty and I feared the worst. “Take this boss. I sensed trouble and kept these for you”. Vivek’s voice from behind, sounded like music. I turned around with great relief and looked at the plate. The sky shattered and the Earth shuddered under my feet; my hyper-excited inner-self crashed into smithereens and disappeared into oblivion. I looked at the cold, crumpled, unattractive, rubbery, unglamorous, hard-boiled, repulsive and shapeless objects for the last time and momentarily blacked out.
“Bon appetite Boss?” Vivek was smiling and I found shades of Amrish Puri and Khulbhushan Karbhanda in him. My face turned crimson with rage. “You just see me in my office Mr.Vivek and don’t forget to get your budget sheets” I hissed viciously and stormed out of the pantry….
(It’s work of fiction and my apologies to Vivek. As a matter of fact, Vivek’s wife makes the most authentic looking Idlis which he keeps getting for us now and then)
……………..