ఈ మధ్య మా దగ్గర బంధువు ఒకరు చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చారు. అయన యాభయ్యవ వసంతంలో అడుగుపెట్టినప్పటికి చూడటానికి, బాగా తంపట వేసిన తాటి తేగ లాగా ధృడంగా ఉంటాడు. ఆరోజు పొద్దుటే నేను దేహంలోని చక్కర నిలువలు ఏపాటి ఉన్నాయో తెలుసుకోవటానికి గ్లూకో మీటర్ వాడుతున్నాను. పేపర్ లో కొత్త రాజధాని అమరావతి విషయాలు తేగ లాగా నమిలేస్తున్న ఆ పెద్దమనిషి ఒక్క ఉదుటున నా దగ్గరకు వచ్చి, నాకు కూడా చూడవయ్యా కాస్త అని అన్నాడు. పలుకే అంత కరుకు గా ఉండే నీకు షుగర్ ఎందుకు ఉంటుందయ్యా చోద్యం కాపోతేను అని జోకేను. పరవాలేదు చూడు అని ముచ్చట పడ్డాడు. సరేలే అని సూదితో ఒక పోటు పొడిచి మీటర్ లోకి ఎక్కించాను. వెంటనే మీటర్ కుయి ..కుయి మని అలారం మోగింది. ఇద్దరు రీడింగ్ చూసి బిత్తెర పోయాం. శుబ్రం గా మూడు సేంచరీలు కొట్టాడు షేవగ్ లాగ!
ఇదేవిటి చెప్మా చూడబోతే పెద్ద చెక్కర నల్ల వ్యాపారస్తుడు లా ఉన్నడే అని విస్తుపోయా. "ఇదేమిటయ్య ఇదేమన్న తప్పు రీడింగ్ చూపిస్తోందా కొంపదీసి" అని కంగారుగా అడిగాడు. అలాంటి దాఖలా ఎప్పుడూ లేదే అన్నాను నేను. సరే ఎలాగా అల్పాహారం తినాలి కదా, టిఫిన్ తిని రెండు గంటల తరువాత మళ్ళీ చూద్దాం. అపుడు భండారం బయటపడుతుంది అన్నాను. "ఎవరిదీ ? నాదా, దానిదా?" అన్నాడు అనుమానంగా! ఇద్దరిదీను అన్నాను గుంభనగా.
మార్నింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది, నచ్చినవి తిన్నట్టు ఉంటుంది, మీటర్ పని పట్టినట్లు ఉంటుంది కనుక అలా నడచి వెళ్లి, ఉడిపి హోటల్ లో టిఫిన్ తిని వద్దాము అన్నాను. ఉడిపి హోటల్ మాకు షుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడకు వెళ్లి మన మామూలు పద్దతిలో మొహమాటం లేకుండా ప్లేట్ ఇడ్లి, సింగల్ వడ, ప్లేట్ పూరి ఆలుగడ్డల కూరతో సహా తిని, కప్పు ఫిల్టర్ కాఫీ తాగి , క్రేన్ వక్కపొడి వేసుకుని మళ్ళీ నడుచుకుంటూ ఇంటి దారి పట్టేము. దారిలో మధుమేహము దాని పుట్టు పూర్వోత్తరాలు, ఆహారము, వ్యాయామము వాటి పాత్ర మొదలైన విషయాలపై ఘాటైన వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఇంటికి వచ్చాము.
అనుకున్న క్షణం రానే వచ్చింది. మళ్ళీ సూదితో ఒక పోటు పొడిచి మీటర్ లో చూసాము. "ఈసారైనా కరెక్టుగా చూపిస్తోందా?" అని ఆత్రంగా అడిగాడు. "ఆహా భేషుగ్గా! సత్య హరిచంద్రుడి మునిమనవడు లాగ ....ఇంకే నాలుగు సెంచరీలు చితక బాదేవు" అన్నాను. హతవిధీ అని కొంచెము కమిలి పోయిన నీటి తేగ లాగ అయిపోయాడు.
ఇక అప్పటినుండి మేధోమధనం ప్రారంభం. ఆరోజే అతని తిరుగు ప్రయాణం. వెళ్ళిన వెంటనే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరిక్షలు చేయించుకుని మందు మొదలు పెట్టమని సలహా ఇచ్చాము. మామూలప్పుడు ఏమి చెప్పినా పెద్దగా చెవిపెట్టని వాడు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాబోలు సరే నన్నాడు. విషయాలన్నీ మాకు వాట్స్అప్ లో పెట్టమన్నాము. ఎందుకన్నా మంచిదని, ఈ విషయం గురించి వాల్లావిడకి వాట్స్అప్ లో రెండు ముక్కలు తగిలించాము.
తను వెళ్ళిన మర్నాడు నుండి నాకు ఎదో తెలియని అలజడి. ఈ విషయం మన దగ్గర బంధువులకు చెప్పక పోతే ఎలా అన్న ఒక విదమైన ఆండ్రాయిడ్ దురద మొదలుపెట్టి చేతిని నమిలేయసాగింది. ఇక తప్పదనుకుని ఒకరిద్దరు దగ్గర వాళ్ళకు వాట్స్ అప్ లో ఉప్పు అందించా.
ఒక రోజు గడిచేసరికి వేసవిలో శేషాచలం కొండలలో వ్యాపించే దావాగ్ని లాగ ఈ వార్త రంగులద్దుకుని బందువర్గాలలో సుళ్ళు తిరుగుతూ వ్యాపించి చివరాఖరుకు నా వాట్స్అప్ లో సంచలన వార్త గా వచ్చింది. ...ఫలాని మన బంధువు మధుమేహం లో డాక్టరేట్ డిగ్రీ కొట్టేసాడని. బౌలింగ్ ఉన్న లేక పోయిన శతకాల మీద శతకాలు బాదేస్తున్నాడని...హౌరా ! అనుకున్నాను. రెండు రోజులు పోయేటప్పటికి బాగా సామాజిక సృహ కలిగిన బంధువొకరు ఇది ఇలా వదిలేస్తే కుదరదు, మన వంతు సహాయం మనం చెయ్యాలని చెప్పి హుటాహుటిన 'మధుమేహుడు' అన్న వాట్స్ అప్ గ్రూప్ ఒకటి చేసి అందరిని గుంపులో గోవింద చేసాడు. ఇక పరిస్థితులు చేయ దాటిపోయాయి. సలహాల, పరామర్శల పరంపర కోటలు పేటలు దాటిపోయాయి.
" అసలు రెండుపూట్ల అన్నం తినటం వలెనే ఈ ముప్పు " అన్నారు ఒకరు.
" ఊరగాయ సీసాలు కళ్ళ ముందు వుండటమే నేరం ' అన్నారు ఇంకొకరు.
"రోజూ డబల్ టిఫిన్స్ వద్దురా అంటే విన్నాడు కాదు"
"అలాగా పాపం! పుంజీడు దోశలు, పది పరోటాలు తిని చక్కగా నిభాయిన్చుకునేవాడు"
" అసలు నెయ్యి వాడటమే వీటన్నిటికీ మూలకారణం " అన్నాడొక ఘ్రుత ద్వేషి ( ఆయన నెయ్యి కంచంలో వేసుకోడు, పక్కవాళ్ళు ఎవరైనా వేసుకుంటే, ఎర్రబారిన తన కళ్ళలో ఆజ్యం చేసుకుంటాడు. అందుకే అయన చూస్తుండగా నెయ్యి వేసుకోవటానికి జంకుతారు)
"అది సర్లేవయ్యా! ఇక జరగవలసింది చూడండి" అన్నాడు పెద్దరికం వొలకబోస్తూ ఒకాయన.
" ఏముంది జొన్న కూడు, రాగి సంకటే దీనికి మందు"
"పొద్దుటే గ్లాసుడు కాకర కాయ రసం పట్టిస్తే యిట్టె గుణం కనిపిస్తుంది"
" ఎవరో పెద్ద మనిషి చెప్పినట్లు పీచు పదార్ధం బాగా తీసుకుంటే జీర్ణ కోశం కుంచె తో కడిగిన ఫ్లాస్క్ లాగా శుభ్రపడుతుందిట"
" వాము, చేదు జీలకర్ర, మెంతులు, నేల గోకుడు తీగ కలిపి నూరి పుచ్చుకోవాలి"
"ఇంకా నయం నూతి గట్టు మీది పాకుడు" అన్నావు కాదు అని చిరాకు పడ్డాడు మధుమేహుడు.
" గంగ వెర్రి కూర, దొంగ గలిజాకు కలిపి పప్పు చేసుకోవాలి"
" దాంట్లో తిక్కరేణి గింజలు పోపు పెట్టాలా " అని తిక్క గా అడిగాడు మధు మేహుడు
" ఇవేమీ కుదిరెట్లు లేవు కాని చక్కగా వంతెన దాటి మంతెన దగ్గరకు పోవటం మేలు " అన్నాడొక ప్రాస కవి.
" అర్జెంటు గా అమెజాన్ లో రుజుతా దివేకర్ పుస్తకాలు పురమాయించి చదువు" అన్నడొక గ్రంధప్రియుడు.
ఇలా వారం గడిచేసరికి వాట్స్ అప్ సందేశాలు హనుమంతుడి తోకలా, అలనాడు సభ లో ద్రౌపది కట్టిన కృష్ణా బ్రాండ్ సిల్క్ చీరలా, ఇంతింతై , వటుడింతై అన్నట్లు తారా ప్రమాణానికి చేరుకున్నాయి.
నిన్న ఉదయం ఫోన్ అందుకుని చూద్దును కదా, గ్రూప్ నుండి 'మధుమేహుడు లెఫ్ట్' అని కనిపించింది. అవాక్కయ్యాను. ఇదేమిటి తనకోసం ప్రత్యేకం గా కట్టిన దేవాలయంలోంచి దేవత మాయమైనట్లు , తన కోసం పెట్టిన గ్రూప్ లోంచి తానే మాయమయ్యాడు? ఇదేమిటి చోద్యం అని తికమక పడ్డాను. ఇక సలహాలు, చిట్కాలు ఎవరికి చెప్తాం అని సామూహికంగా వాపోయ్యారు గ్రూపీయులు.
ఏమి జరిగిందో తెలుసుకుందామని వాళ్ళ ఆవిడకు వాట్స్అప్ కాల్ చేసాను. ఆమె ఎంతో విషాదంగా " ఏమి చేస్తారు చెప్పండి. అహో రాత్రాలు, పరామర్శలు, సలహాలు, చిట్కాలు. అది తినొద్దు..ఇది తిను, అది తాగొద్దు..ఇది తాగు..ఈ పొడుం తిను ...ఆ రసం తాగు అన్న సలహాల సునామీకి అయన చీకాకు బాగా పెరిగిపోయి వేసుకున్న మందు కూడా వంట బట్టటం లేదు. ఈ సలహాల గుండు సూదులతో బుర్ర, పిన్ కుషన్ లాగ అయిపోయిందని బాధపడుతున్నారు. అందుకునే గ్రూపు నుండి వచ్చేసారు. మీరైనా అర్థం చేసుకుంటే అదే పదివేలు" అని వాపోయింది.
"ఒహో అదా సంగతి. నువ్వేమి బాధ పడకమ్మా! నేను చూసుకుంటానులే. అయిన జనాలకి వేళాపాళ, సమయం సందర్భం, వివేకం విచక్షణ ఉండొద్దూ! " అని సానుభూతి తెలిపా.
" అన్నట్లు విషయం మరిచా; నేరేడు గింజలు, మెంతి గింజలు వేయించి, పొడుం గొట్టి , గోరు వెచ్చని నీటితో... ..కుయి...కుయి...కుయి...ఇదేంటి ఫోన్ కట్ అయిన శబ్దం వస్తోంది. కట్ అయిందా ...లేక చేసిందా ..? అయినా నేనేమీ తప్పు చెప్పలేదే !!" అని అయోమయం గా బుర్ర గోక్కున్నాను.
*****