చలి మంచు కెరటాల తడిసి గజ గజ లాడింది లోకం,
మసక వెలుగుతో నిద్రలేచాడు వణుకుతూ దివాకరం,
వడి గ వీది వెంట కదిలాడు హరిదాసు చేస్తూ హరి స్మరణం,
సన్నాయి రాగం తో వయ్యారంగా కదిలింది గొంగిరేద్దుల మేళం.
వీది వీదిన చిరు చీకటి లో రగిలాయి భోగి మంటలు,
ఇంటింట గాదెల్లో నిండాయి సరి కొత్త పంటలు,
ఆనందాలు ఆత్మీయతలు పంచంగ వచ్చారు కొత్త జంటలు,
వంటిల్ల పొంగాయి అరిస బొబట్లు మరెన్నో తీపి వంటలూ,
పిల్ల పాపల తలల నుండి జారు వాలే ఆశీసుల భోగి పళ్ళు,
ఆబాల గోపాలం తోడిగేరు కొత్త దుస్తులు చెదరంగా కళ్ళు,
ఇంటింట త్రుల్లెను అసలా ఆనందాల పరవళ్ళు ,
ఆత్మ రాముని సేవకు వచ్చెను పులిహోర బొబ్బట్లు, గారే ఆవళ్ళు.
ఏటేట వచ్చి మురిపించెను ఈ ఆనందాల సంక్రాంతి ,
ఏనాడు నిమ్పెనో మబ్బు మనస్సులో ప్రేమానురాగాల కాంతి,
రగిలే భోగి మంటల్లో ఏనాడు తొలగేనో స్వార్థ చింతనల బ్రాంతి,
ఆనాడే నిజమైన సంక్రాంతి ..మానవత్వం తెచ్చే శాంతి - క్రాంతి
3 comments:
its a beautiful imagination,which we can never experience again.all those things has become lovely memories now.We have gone 40 years back in time machine to experience all those simple ,lovely things.Hope we again see those good old villages again with haridas,gangireddu melam,muthyala muggulu etc.
bhavani,anjana,sarojini devi
Hi
Thanks to all of you for the nice words. Feel good that the poem transported you all back to those good old days of simple village life. we do miss all those interesting stuff and may be we should all one day go 'Back to the Past'. May all of you have a very happy and prosperous Sankranti
cheers
It is good to be reminded over and over about all our traditions, because I am afraid we are on the verge of forgetting our roots and values and trapped in this world filled with stress. Thanks.
Post a Comment