భోగి మంటల ఎరుపులో సూరీడు పొద్దు పొడిచే;
వెలుగు కిరణాల బాణాలు పొగమంచు తెరలు చీల్చే;
చలిమంచు ముత్తెంపు సరులు గొబ్బెమ్మ సిగపూలు కొలిచే;
హరిదాసు ఆటలు, బసవన్న పాటలు సంక్రాంతి లక్ష్మికి కైవారమిచ్చే!
కొత్త బియ్యంపు బెల్లపు పొంగలి, నేతి అరిసెలు,
బొబ్బట్లు, నువ్వు లడ్డూలతో నోరు మధురమయ్యే !
జంతికలు, సకినాలు, పప్పు చెక్కలు, పులిహోర,
వడలు, ఉల్లి గారెలతో నోరు వర్ర నయ్యే !
వీధి వీధిన పండుగ వేడుకలు; ఇంటింటిన సరదాల పరవళ్ళు;
కొత్త బట్టల్లో మురిసేరు పిల్ల పెద్దలు; నగలతో మెరిసారు ఇల్లాళ్ళు;
అత్తింటి విందులకై అల్లుళ్ళ పరుగులు;
కొత్త కోడలికై అత్తింట మంగళ హారతులు!
రంగవల్లుల పోటీలో బిగిసేను బంధాలు;
గొబ్బెమ్మ పాటలలో కలిసెను కొత్త స్నేహాలు;
బొమ్మల కొలువులో విరిసేను సంస్కృతీ సుమాలు;
వీటన్నిటినీ ఏటేటా మనకిచ్చే సంక్రాంతి లక్ష్మికి కోటి దండాలు!!

No comments:
Post a Comment