ముక్కంటి మర్మము !
మూడు కన్నుల సామి వి నిను ముదమార చూడంగ ,
రెండు కన్నుల కెట్లు కుదిరెను మరి యది ఏమి మర్మమనంగా
నిండార నీ మేను యలంకరిన్చంగా, బట్టు వలిపెములు దేచ్చేము మేము
మృగ చర్మ ధారివై , చిరు నగవు న చూసేవు ఇవి యేల నాకని పశుపతి వైన నీవు
కస్తూరి,జవ్వాజి సుగంధాలు నీ తనువు న బుయ్యంగా ప్రేమ దీరగ తెచ్చేము మేము
వొడలంతా భూది తో ఇవి యేల నాకని మంద హాసం చేసావు భస్మ లేపితుడవైన నీవు
ముదమార నిను అర్చింప గ, దివ్య కుసుమంపు మాలలు అనేకములు దేచ్చేము మేము
పన్నగ హారమును దాల్చి, అవి యేల నాకని నగు మోము చూసేవు నాగ భూషనుడవైన నీవు
భక్త వత్సలుడవైన నిను భక్తి మీరగ బూజింప పుణ్య నదీ సప్త సాగర జలాలు తెచ్చేము మేము,
జడల మాటున గంగను దాల్చి , ఇవి యేల నాకని, అచ్చెరువున చూసేవు గంగానాదుడవైన నీవు.
ప్రేమ మీరగ నివేదించగ నీకు, పంచ భక్ష్య పరమాన్నములు దేచ్చేము మేము
లోకాల గాయంగా, గరళ మెత్తి, ఇవి యేల నాకని, ప్రసన్నమున జూసేవు నీల కంటు డవైన నీవు
సంగీత నృత్యాల నిను మురిపంప , నీ సన్నిధిని అనంత వైభవము గ నర్తించేము మేము
తాండవ కేళిని జగముల నూగించి, ఇవి యేల నాకని, ఆభయమిచ్చేవు నటరాజ మూర్తివైన నీవు
వేలాది తైల దివ్వెల కాంతిని కనులార నిను గన కార్తిక దీపములు వెలిగించేము మేము
నెలవంక శిరమున దాల్చి, ఇవి యేల నాకని, సంబ్రమమున జూసేవు, తేజో రూపుడవైన నీవు
సిరి సంపదలు, ధన ధాన్యములు, ఇహ లోక సుఖములు ఇవ్వమని కై మోడ్చి ప్రార్తిన్చేము మేము
కపాలము చేపట్టి, మరు భూమి న దిరుగుచు చిద్విలాసము చేసేవు అది భిక్షువైన నీవు
తెలిసీ తెలియక, మాయ వాగుర చిక్కుకుంటిమి, తెలిసినది 'మర్మమిపుడు',
నేరేడు మారేడు, తంగేడు గన్నేరు, మనసారా యిచ్చిన చాలునని నేడు
నిను జూడ చర్మ చక్షువులకు కది సాధ్యము గాదు, కావలెను మనో నేత్రంబు యద్దానికి,
'కనులు మూసి ' ప్రార్తిన్తుము, మా 'కను విప్పు' జేయుము కరుణించి యిక
మనో నేత్రమున జూడ అగుపించును ముక్కంటి ఇది తథ్యము!
ఉన్నాడని తెలియును లే మనయందే పరమేశుడు ఇది 'పరమ సత్యము'
అపుడు నిండును మది యంతా యొక దివ్య చైతన్య పార వశ్యము

నిక్కముగా అనిపించును యపుడు, అని, జగమంతా 'శివ మయం '
-రమణారావు
ముంబై ఫిబ్రవరి 12 , 2010
-రమణారావు
ముంబై ఫిబ్రవరి 12 , 2010
No comments:
Post a Comment